వాట్సాప్‌లో Forwarded మెసేజ్‌ల వెరిఫికేషన్.. అదేలా పనిచేస్తుందో తెలుసా?

వాట్సాప్‌లో Forwarded మెసేజ్‌ల వెరిఫికేషన్.. అదేలా పనిచేస్తుందో తెలుసా?

 

ఫేస్‌బుక్ సొంత యాప్ వాట్సాప్ ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టడానికి త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాలను ధృవీకరించే సామర్థ్యాన్ని త్వరలో విడుదల చేయనుంది. రాబోయే కొత్త వాట్సాప్ ఫీచర్ ఏంటి? అదేలా పనిచేస్తుందో ఓసారి తెలుసుకుందాం.. 

 

ఫార్వర్డ్ మెసేజ్ వెరిఫికేషన్ :


ముంబై మిర్రర్ నివేదిక ప్రకారం.. వాట్సాప్ త్వరలో ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రవేశపెట్టనుంది. ఇది వాట్సాప్ ఫార్వర్డ్లను ప్రామాణీకరించే కొత్త సామర్థ్యాన్ని ఇస్తుంది. వాట్సాప్ ద్వారా మీ చాట్ బాక్సులో షేర్ అయిన సమాచారం నిజమో కాదో తెలుసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఫార్వార్డ్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లు ఇప్పటికే 'ఫార్వార్డ్' గా లేబుల్ చేయడం జరిగింది. వాట్సాప్ కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

 

ఫార్వర్డ్ మెసేజ్‌ల ధృవీకరణ: ఎలా పని చేస్తుంది?


వినియోగదారులు glass icon నొక్కాల్సి ఉంటుంది. ఆ తరువాత పాప్-అప్ మెసేజ్ "Would you like to search this on the web? ఇది మెసేజ్ గూగుల్‌లో అప్‌లోడ్ చేస్తుంది" అని ఉంటుంది. వినియోగదారులు Cancel ఆప్షన్ లేదా Search వెబ్ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ఒక ఆప్షన్ పొందుతారు. ఈ విధంగా సమాచారాన్ని ధృవీకరించవచ్చు. అప్పుడే వాట్సాప్ యూజర్లకు ఆ మెసేజ్ ఫేక్ లేదా రియల్ అనేది తెలుసుకోవచ్చు. 

వాట్సాప్ ఫేక్ వార్తలను నిరోధించడానికి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసినట్లు యూజర్లకు రిమైండ్ చేస్తోంది. ఇతరులకు షేర్ చేసిన ప్రతి మెసేజ్‌ను ఫార్వార్డ్ అని మెసేజ్‌లను లేబుల్ చేయడం ప్రారంభించింది. అదనంగా, యూజర్లు రోజుకు కేవలం 5 ఫార్వార్డ్ మెసేజ్‌లను ప్లాట్‌ఫామ్‌లో పంపే వీలుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కరోనావైరస్ వ్యాప్తికి ఫేక్ వార్తలు వ్యాప్తిచెందుతున్నాయి. భారత ప్రభుత్వం, WHO, UN కూడా ప్రత్యేకమైన వాట్సాప్ బాట్లను విడుదల చేశాయి. తద్వారా వినియోగదారులు హెల్ప్‌లైన్ నంబర్లను చేరుకోవచ్చు. సరైన కరోనావైరస్ సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.