క్రికెట్ మైదానంలో న‌వ్వులు..

క్రికెట్ మైదానంలో న‌వ్వులు..

క్రికెట్ మ్యాచ్ అంటేనే రెండు జట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌టం.. అలాంటి చోట ఎంత ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంటుందో మ‌న‌కి తెలుసు, కానీ అలాంటి ఫుల్ సీరియ‌స్ సిట్యుయేష‌న్ లో అనుకోకుండా ఒక‌ ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగితే.. స్టేడియం అంతా న‌వ్వులే. అలాంటిదే ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో జరిగిన ఓ ఘటన క్రికెట్ అభిమానులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. పీఎస్‌ఎల్‌లో లాహోర్ ఖలందర్, కరాచీ కింగ్స్‌ల మధ్య ఆదివారం రాత్రి  మ్యాచ్‌ జరుగుతుండగా ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరాచీ కింగ్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నెలకొల్పింది. ఆ తరువాత లాహోర్ ఖలందర్స్ ఛేజింగ్ ప్రారంభించింది. కరాచీ కింగ్స్ వికెట్ కీపర్ చాడ్విక్ వాల్టన్, లాహోర్ ఖలందర్స్‌ బ్యాట్స్ మాన్ బెన్ డంక్ ను అవుట్ చేసే ప్రయత్నంలో బ్యాట్స్ మాన్ కాళ్ళు పట్టుకున్నాడు. లాహోర్ ఖలందర్ ఇన్నింగ్స్ లో 10 వ ఓవర్ లో కామెరాన్ డెల్పోర్ట్ బాల్ని రివర్స్ స్వీప్ చేయాలనుకున్నాడు. బాల్ ని బ్యాట్‌తో కొట్టడంతో వికెట్ కీపర్ వాల్టన్ క్యాచ్ పట్టుకోడానికి ప్రయత్నించాడు, అయితే అందులో కొంచెం తొందరపాటు చూపించాడు కానీ బాల్ ని పట్టుకోబోయి బ్యాట్స్‌మన్‌ను పట్టుకున్నాడు.

ఈ వీడియో చూసిన తర్వాత ట్విట్టర్‌ యూజర్స్ నవ్వడం ఆపుకోలేకపోయారు. ఈ వీడియోను పాకిస్తాన్ సూపర్ లీగ్ అధికారిక ఒక‌రు ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు వాల్టన్ పైన సరదాగా కామెంట్స్ వెయ్యడం ప్రారంభించారు. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.