రిపీట్ కానున్న రేసుగుర్రం కాంబినేషన్ ?

రిపీట్ కానున్న రేసుగుర్రం కాంబినేషన్ ?

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి విడుదలైన అలా.. వైకుంఠపురంలో చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో అల్లుఅర్జున్ కు జోడిగా పూజా హెగ్డే నటించగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ చేసాడు. తమన్ స్వరపరిచిన ఈ సినిమాలోని పాటలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచి తెలుగు ఇండస్ట్రీ లో నాన్ బాహుబలి రికార్డు ను సాధించిన హీరోగా అల్లు అర్జున్ ను నిలబెట్టింది. 

దీంతో అల్లు అర్జున్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం లో వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే ఈ సినిమా తరువాత చేసే సినిమా పై కూడా స్టైలిష్ స్టార్ క్లారిటి ఇచ్చినట్లు తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే యాక్షన్ కి, ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ, స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకునే దర్శకుల జాబితాలో సురేందర్ రెడ్డి ముందుంటుంది. ఈయన నుండి వచ్చిన సైరా నరసింహరెడ్డి చిత్రం తెలుగులో సత్తా చాటి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత బన్నీ కోసం ఓ కథను సిద్ధం చేసిన  సురేందర్ రెడ్డి, ఇటీవలే అల్లుఅర్జున్ ను కలిసి వినిపించాడు.

 అయితే సుకుమార్ సినిమాపై దృష్టిపెట్టిన అల్లు అర్జున్ ఈ సినిమా పై  ఇంకా ఏ విషయమూ చెప్పలేదని సమాచారం. కానీ గతంలో బన్నీ-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో 2014 లో వచ్చిన 'రేసుగుర్రం' చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవడమే కాకుండా బన్నీని ఈ చిత్రం అమాంతం పెంచేసింది. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డికి బన్నీ గ్రీన్  సిగ్నల్ ఇవ్వడం ఖాయమేనని చెప్పుకుంటున్నారు.