
ఈ మధ్య కొత్త కొత్త టాలెంట్లతో జనాలు పుట్టుకొస్తున్నారు. నేను చేసింది మరెవరు చెయ్యకూడదు అనేది ఒక ఆలోచన అయితే.. ఇందులో నా మార్క్ గొప్పదిగా ఉండాలి అనుకోవడం మరో ఆలోచన... కారణం ఏధైనా చాలా మంది మంచి మంచి ఆలోచనలతో తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా ఒకావిడ సూర్య కిరణాలతో వేసిన పెయిటింగ్ ట్రెండ్ అవుతుంది.
బొమ్మలు గీయాలంటే పెన్సిల్ లేదా పెయింటింగ్ బ్రష్ వాడతారు. కానీ, ఆమె మాత్రం సూర్య కిరణాలనే బ్రష్‌గా మలచుకుంది. వివిధ పరిమాణాల్లో ఉన్న బూతద్దాలతో బొమ్మలను గీస్తూ ఔరా అనిపిస్తోంది. ట్విట్టర్లో పోస్టు చేసిన ఈ వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ప్రతిభకు ఫిదా అవుతున్నారు.
ఆమె తండ్రి వడ్రంగిగా పనిచేసేవాడని, ఆ సమయంలో ఆమె మిగిలిపోయిన చెక్క దుంగలపై బూతద్దాల సాయంతో చిత్రాలను గీయడం నేర్చుకుందని ట్వీట్లో పేర్కొన్నారు.
ఇలా బొమ్మలు గియ్యడానికి ఆవిడ చాలా కష్టపడాల్సి వస్తుంది.. ఎండని తట్టుకోవాల్సి వస్తుంది.. కానీ ఆవిడ అదంతా అధిగమించి ఈ ఆర్ట్ వెయ్యడానికి కారణం తనకి ఆ ఆర్ట్ మీద ఉన్న ఇష్టమేనని తెలిపింది.