రేపిస్ట్ నాలిక కొరికేసింది..

రేపిస్ట్ నాలిక కొరికేసింది..

 

దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటించిన రోజు... రాత్రి 8న్నర అయ్యింది. రోడ్డుపై పెద్దగా జనం లేరు. ఇద్దరు కేటుగాళ్లు... బెంగాల్... జల్పాయ్‌గురిలోని ఒంటరిగా ఉన్న ఓ పెద్దామె ఇంట్లోకి ప్రవేశించారు. ఆ టైంలో ఆమె టీవీలో వార్తలు చూస్తోంది. వాళ్లిద్దరూ లోపలికి రాగానే... ఎవరు మీరు... ఏం కావాలని అడిగింది. వెంటనే తలుపు గడియ పెట్టడంతో... ఆమె వాయిస్ పెంచింది. ఎవరు మీరు... ఎందుకొచ్చారు అని అడుగుతుంటే... ఇద్దరిలో ఒకడు ఆమె నోరు నొక్కి... బలంగా పట్టుకున్నాడు. మరొకడు ఆమెను కాళ్లను పట్టుకునేందుకు యత్నించాడు. ఆమె బాగా గింజుకుంది. ఇద్దరూ చెరోవైపూ పట్టుకొని... ఆమెను బెడ్ రూంలోకి లాక్కుపోయారు. బెడ్ రూం తలుపు కూడా వేసేశారు.

ఆమె ఎంత అరుద్దామని ప్రయత్నిస్తున్నా... ఇద్దరూ ఆ అవకాశం ఇవ్వకుండా చేయసాగారు. ఏం చేస్తే వాళ్ల నుంచీ తప్పించుకోవచ్చో ఆమెకు అర్థం కాలేదు. ఆమె మనసులో ఎన్నో రకాల ఆలోచనలో, ఎన్నో భయాలు, చెప్పలేనంత టెన్షన్. ఆ పరిస్థితుల్లో ఒకడు ఆమెపైకి ఉరికి... ముద్దు పెట్టుకోవాలని చూశాడు. ఆమె ఎంత గింజుకున్నా వదల్లేదు. ఆ విపత్కర పరిస్థితుల్లో ఆమె... ఒక్కసారిగా అతని నాలికను తన నోటితో కసక్కున కొరికేసింది. దెబ్బకు నాలిక రెండుగా ముక్కలైంది. అంతే... వాడు కెవ్వు కేక పెట్టాడు. అది చూసిన మరొకడు... "వామ్మో నాయనో వద్దురా బాబో" అంటూ తలుపులు తెరచి పారిపోయాడు.

నాలిక తెగిన తర్వాత అదెక్కడో పడిపోయింది. పారిపోదామంటే... నాలిక లేదనే టెన్షన్... నాలిక కోసం అటూ ఇటూ వెతికాడు. దుప్పట్లో ఓ మూల అది కనిపించింది. దాన్ని తీసుకొని... వాడు కూడా "దొరికిందిరా దేవుడా" అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు. జల్పాయ్‌గురి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్లు అతనికి నాలికను సర్జరీ చెయ్యలేకపోయారు. అప్పటికే చాలా ఆలస్యమైందనీ, తెగిన ముక్క పాడైపోయినందువల్ల దాన్ని సెట్ చెయ్యలేమని చెప్పారు. తర్వాత అతన్ని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు పంపారు.

ఆ ఇద్దరూ స్థానికులే అన్న పంచాయితీ మెంబర్ రంజిత్ రాయ్... వాళ్లకు కఠిన శిక్షలు వెయ్యాలని కోరారు. కానీ పోలీసులు ఇంకా FIR నమోదు చెయ్యలేదని తెలిసింది.