బ్యూటీ పార్ల‌ర్ కు తీసుకెళ్ళండి... సోనూసూద్ కి మ‌హిళ రిక్వెస్ట్

బ్యూటీ పార్ల‌ర్ కు తీసుకెళ్ళండి... సోనూసూద్ కి మ‌హిళ రిక్వెస్ట్

 

కేంద్రం విధించిన లాక్ డౌన్ కార‌ణంగా వ‌ల‌స కూలీలు ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారో మ‌నం రోజూ టీవీల్లో చూశాం. అయితే వారిని స్వ‌స్థ‌లాల‌కు తీసుకెళ్ళ‌డానికి న‌టుడు సోనూసూద్  కూడా అంతే క‌ష్ట‌ప‌డ్డాడ‌నే చెప్పాలి. సొంత ఖ‌ర్చుల‌తో వాళ్ళ‌కు ర‌వాణా స‌దుపాయాలు ఏర్పాటు చేసి, భోజనం, మంచినీళ్లు కూడా అందించాడు. 

ఎవ‌రు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా సోష‌ల్ మీడియాలో ఒక్ పోస్ట్ పెడితే చాలు సోనూ స్పందించేవాడు. వారిని త‌మ ఇంటికి జాగ్ర‌త్త‌గా తీసుకు వెళ్ళేందుకు చ‌ర్య‌లు తీసుకునేవాడు. దీంతో ఎప్పుడూ సినిమాల్లో విల‌న్ వేషాలు వేసే సోనూసూద్ దేశం మొత్తానికి హీరో అయిపోయాడు.. అయితే కొంద‌రు అత్యుత్సాహంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా సోనూసూద్ పై పిచ్చి కామెడీలు చేస్తున్నారు..

నిన్న ఓ మ‌హిళ తాను బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్ళి రెండు నెల‌లు పైనే అవుతోంద‌ని, త‌న‌ను బ్యూటీ పార్ల‌ర్ కు తీసుకు వెళ్లాలంటూ సోనూని కోరింది. అయితే దీనిపై సోనూ సూద్ సీరియ‌స్ అవ‌లేదు. మీరు దేనికోసం సెలూన్‌కి వెళతారు? నేను సెలూన్ ఉద్యోగులను వారి గ్రామాలకు పంపించాను. మీరు కావాల‌నుకుంటే వారి గ్రామాల‌కు వెళ్ళండి అని రిప్లై ఇచ్చాడు. దీంతో పాటు మ‌రో వ్య‌క్తి త‌నను వైన్ షాపుకి తీసుకెళ్లండంటూ సోనూని కోరాడు. దీనిపై కూడా సోనూసూద్ సీరియ‌స్ అవ‌లేదు. మిత్ర‌మా నిన్ను వైన్ షాపుకి తీసుకెళ్ళ‌లేను కానీ తాగి వ‌చ్చేట‌ప్పుడు మాత్రం వైన్ షాప్ నుంచి తీసుకురాగ‌ల‌ను అంటూ ట్వీట్ చేశాడు.

అయితే ఇలాంటి పిచ్చి కామెంట్లు చేసే వారిపై నెటిజ‌న్లు మాత్రం తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఒక వ్య‌క్తి ఇంత గొప్ప ప‌నులు చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఇలా ఎలా మాట్లాడ‌తారంటూ వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.