ఎల్లో మీడియా కు షాక్.. సాక్షి టీవీతోనే మోడీ వీడియో కాన్ఫరెన్స్

ఎల్లో మీడియా కు షాక్.. సాక్షి టీవీతోనే మోడీ వీడియో కాన్ఫరెన్స్

 

ఎల్లో మీడియాకు జీర్ణించుకోలేని వార్త ఇది. జగన్, ప్రధాని మోదీల మధ్య రోజు రోజుకీ సాన్నిహిత్యం పెరిగిపోతోంది. ఒకరికొకరు సహకరించుకుంటూ శత్రువులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. ఉమ్మడి ప్రత్యర్థి చంద్రబాబుకి మోదీ, జగన్ లు ఇప్పటికే వరుస షాక్ లిస్తున్నారు. వాటి నుంచి తేరుకోకముందే చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియాకు షాక్ తగిలింది. అది మామూలు షాక్ కాదు.

 చంద్రబాబు అనుకూల మీడియాకు జీవితాంతం దక్కనంత గౌరవం జగన్ ఛానల్ కి మాత్రమే దక్కింది. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన గౌరవం ఇది. దేశంలోని ప్రస్తుత హెల్త్ ఎమర్జెన్సీ పై ప్రధానమంత్రి మోదీ దేశంలోని మీడియా నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ , ప్రాంతీయ మీడియాల్లో ఎంపిక చేసుకున్న టీవీ ఛానళ్ల తోనే ప్రధాని మోదీ ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశం అసాధారణమైన పరిస్థితుల్లో ఉన్నందున ప్రధాని మోదీ ఈ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మోదీ ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను చైతన్య పరుస్తున్న టీవీ ఛానళ్లను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించారు. ఇంత ప్రత్యేకమైన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ కు దక్షిణ భారత దేశంలో ఒకే ఒక్క టీవీ ఛానల్ కు ఆహ్వానం దక్కింది. అది ఒక్క వైఎస్ జగన్ యాజమాన్యంలోని సాక్షి టీవీకి మాత్రమే దక్కింది. తెలుగు మీడియాలో టీవీ9, ఈటీవీ, ఎన్టీవీ వంటి ఛానళ్లకు వేటికీ ఈ అవకాశం దక్కలేదు. చాలా భాషల్లో ఛానళ్లు ఉన్న టీవీ9, ఈటీవీలకు కూడా ఈ ఛాన్స్ రాలేదు. టీవీ9 భారత్ వర్ష్ అనే ఛానల్ కి దక్కింది కానీ అసలు  ఆ నెట్ వర్క్ మొట్టమొదటి ఛానల్ అయిన టీవీ9 కి మాత్రం దక్కలేదు.  సాక్షి టీవీ నుంచి మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, ఇతర టీమ్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దేశంలోని పెద్ద పెద్ద జాతీయ ఛానళ్ల యాజమాన్యాలు, చీఫ్ ఎడిటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

ఇంత పెద్ద గౌరవం సాక్షి టీవీకి ప్రధాని మోదీ ఇవ్వడం ఓ రకంగా ఎల్లో మీడియాకు మింగుడుపడని విషయమే. కానీ మోదీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రజా  చైతన్యాన్ని మరింత విస్తృతపరిచి  జాతీయ విపత్తు నుంచి ప్రజలను కాపాడే గురుతర బాధ్యతను భుజాన వేసుకోవాలని మీడియాకు సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియా నుంచి సలహాలు స్వీకరించారు. స్వదీశీ విమానాలను కూడా నిలిపివేయాలని సాక్షి మేనేజింగ్ ఎడిటర్ సూచించడంతో బుధవారం నుంచి అది అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ మోదీ నిర్వహించిన ఉద్దేశ్యం చాలా ఉదాత్తమైనదైనప్పటికీ రాజకీయంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మీడియాకు షాక్ ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఫుల్ జోష్ ఇచ్చింది.