బాబు జైలుకే... మోడీ కి ఆధారాలు ఇచ్చిన జగన్

 బాబు జైలుకే... మోడీ కి ఆధారాలు ఇచ్చిన జగన్

ప్రధానమంత్రి మోదీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిల సుదీర్ఘ భేటీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. అసలు జగన్ కి అపాయింట్ మెంటే లేదని ఇన్నాళ్లూ ప్రచారం చేసుకున్న టీడీపీకి ఇప్పుడు ఈ భేటీ పంటికింద రాయిలా మారింది. చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ జగన్ కి, మోదీకి గ్యాప్ పెంచాలని చూశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రధానమంత్రి మోదీ మరోసారి జగన్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని రుజువు చేశారు. అపాయింట్ మెంట్ అంటే అలాంటి ఇలాంటిది కాదు. ఏకంగా గంటన్నర పాటు జగన్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. 

జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ప్రతీ విషయాన్ని క్షుణ్నంగా విన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధుల విషయాన్ని మోదీ కి వివరించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ, రెవెన్యూ లోటు కింద రావాల్సిన నిధులను కోరారు. పోలవరం ప్రాజెక్టు కు కేంద్రం చెల్లించాల్సిన 3700 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. శాసనమండలిని రద్దు చేయాలని, దిశ చట్టాన్ని దేశమంతా అమలు చేయాలని కోరారు. తన పాలన కోసం సుదీర్ఘంగా ప్రధానికి వివరించిన జగన్ ఇదే తడవుగా చంద్రబాబు ని జైలు లో పెట్టే స్కెచ్ కూడా వేసినట్టు సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబు అవినీతికి సంబంధించిన‌ ఆధారాలను ప్రధాని మోదీకి అందించారు. 

దీనిపై ఇప్పటి జరుగుతున్న సీఐడి విచారణ, మంత్రివర్గ ఉపసంఘం విచారణ డేటాను అందించారు. దానికి తోడు ఇటీవల చంద్రబాబు పీఏ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఐటి దాడుల సమాచారాన్ని కూడా మోదీకి వివరించారు జగన్. ఈ ఆధారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుని జైలులో పెట్టేందుకు అవసరమైన విచారణ వేయాలని కోరినట్టు సమాచారం. రాజకీయంగా కూడా బీజేపీని, వ్యక్తిగతంగా మోదీని చంద్రబాబు దూషించిన తీరుని జగన్ ఈ భేటీలో మోదీకి వివరించారు. ఇప్పుడు తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు ఆయన కోటరీ ఎంపీలను సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లను బీజేపీలో చేర్చిన సంగతి కూడా వివరించారు. 

ఇవన్నీ ఎలా ఉన్నా భవిష్యత్ లో రాజకీయంగా తాను బీజేపీకి తోడుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. తనకు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పెట్టిన వేధింపులపై రివేంజ్ కు సహకరించాలని మోదీని జగన్ కోరినట్టు సమాచారం. ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్, టీడీపీ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై చంద్రబాబుని ఇరికించి జైలుకు పంపాలన్న ఆకాంక్షను మోదీ వద్ద వెల్లడించారన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది. కొన్ని బిల్లులకు తప్ప భవిష్యత్ లో బీజేపీ బలం తగ్గిపోయినప్పుడు రాజ్యసభలో వైఎస్సార్ సీపీ పూర్తిగా ఎన్డీయేకు మద్దతునిస్తుందని తెలిపారు. ఇప్పుడు గంటన్నరసేపు భేటీతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓ వైపు పీఏ శ్రీనివాస్, టీడీపీ నేతల ఇళ్లపై ఐటి దాడులు, ఆ వెంటనే మోదీ, జగన్ ల భేటీతో ఎప్పుడు ఏ కేసు వచ్చిపడుతుందోనన్న టెన్షన్ టీడీపీ నేతలను వెంటాడుతోంది.