జగన్ మాస్టర్ ప్లాన్.... 24 గంటల్లోనే ఐటి ఉచ్చులో చంద్రబాబు

జగన్ మాస్టర్ ప్లాన్.... 24 గంటల్లోనే ఐటి ఉచ్చులో చంద్రబాబు

డాట్ న్యూస్ చెప్పిందే జరిగింది.. చంద్రబాబుని జైలుకు పంపేందుకు జగన్ స్కెచ్ వేశారని డాట్ న్యూస్ ముందే చెప్పింది. అచ్చం అదే జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి జగన్ ల భేటీ అయిన 24 గంటల్లోనే పెను సంచలనం జరిగింది. మోదీ, జగన్ లు భేటీ అయిన ఒక్క రోజులోనే చంద్రబాబు లెక్క తేల్చేశారు. 

ఐటి శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓ వినూత్నమైన ప్రకటన విడుదల చేసింది. జగన్ తన మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో రుచి చూపించారు. ప్రధానమంత్రితో  భేటీ తరువాత జగన్ ఫుల్ జోష్ లో కనిపించారు. ఎంపీలంతా ఎందుకింత ఆనందంగా ఉన్నారని ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు ఐటి శాఖ విడుదల చేసిన అనుబాంబులాంటి ప్రెస్ నోట్ జగన్ స్కెచ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో రుజువు చేసింది. సాక్షాత్తూ చంద్రబాబు పీఎస్ పేరుని పరోక్షంగా ఆ ప్రెస్ నోట్ లో ఐటి శాఖ పేర్కొంది. దీంతో చంద్రబాబుకి ముచ్చెమటలు పడుతున్నాయి. హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక నెక్స్ట్ తన వద్దకే ఐటి వస్తుందన్న గుబులు మొదలైంది. ఐటి శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ లో సంచలన విషయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సోదాలపై ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్ ప్రకటన జారీచేసింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో 2000 కోట్ల లావాదేవీలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. హైద్రాబాద్, విజయవాడ, ఢిల్లీ, పూణే, కడప, వైజాగ్ తో సహా మొత్తం 40 చోట్ల సోదాలు జరిగాయి. మూడు ఇన్ఫ్రాల ద్వారా కోట్లరూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు సేకరించారు.

 ఇటీవల ఏపీలో టీడీపీ నాయకుల సన్నిహితులపై ఐటీ దాడులు జరుపగా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు అకౌంట్లు లేనట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నెల 6న విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణేలో ఐటీ శాఖ దాడులు జరిపింది. చంద్రబాబు మాజీ పి ఎస్ శ్రీనివాస్ తో సహా మరో మూడు సంస్థలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు. 25 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. బోగస్ బిల్లులతో పాటు, బోగస్ ఇన్వాయిస్ లు, బోగస్ సబ్ కాంట్రాక్టులను అధికారులు గుర్తించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు ప్రకటించారు. పన్ను లెక్కలకు దొరకకుండా రూ 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులు దారి మళ్లించినట్లు గుర్తించారు. బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. ఈ ఐటి సోదాలన్నీ చంద్రబాబు అనుచరుల ఇళ్లల్లోనే జరగడంతో ఇదంతా చంద్రబాబు మెడకు చుట్టుకున్న ఉచ్చుగా అంతా భావిస్తున్నారు. చంద్రబాబు సన్నిహితులు కిలారు రాజేష్, నరేన్ చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ల ఇళ్లల్లో జరిగిన సోదాల్లోనే ఇవన్నీ గుర్తించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ బోగస్ లావాదేవీల తీగలాగితే కదిలేది చంద్రబాబు డొంకేనని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. జగన్ , మోదీలు మీటింగ్ జరిగిన 24 గంటల్లోనే జరిగిన ఈ పరిణామం చంద్రబాబుకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.