తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : వైఎస్‌జగన్‌

0
222
ys jagan

తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తిమీద దైవ శక్తి సాధించే విజయానికి ప్రతీక దీపావళి పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు జననేత బుధవారం ట్వీట్‌ చేశారు.