మళ్లీ ఎంట్రీ ఇవనున్న భారత్ ఆటగాడు : జహీర్‌ ఖాన్‌

0
151
Zaheer Khan

ఒకప్పటి భారత క్రికెట్‌ జట్టు ప‍్రధాన ఆటగాడు అయిన జహీర్‌ ఖాన్‌ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెలలో షార్జాలో ఆరంభం కానున్న టీ10 లీగ్‌లో జహీర్‌ఖాన్‌ ఆడనున్నాడు. ఈ టోర్నీ నవంబర్‌ 23 నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ లీగ్‌లో భారత్‌ నుంచి అప్పుడు ఒక్కడే ఆడగా ఈసారి మాత్రం పలువురు భాగస్వామ్యం అవుతున్నారు. జహీర్‌ ఖాన్‌, ప్రవీణ్‌ కుమార్‌, ఆర్పీ సింగ్‌, ఆర్‌ఎస్‌ సోధి, సుబ్రమణ్యం బద్రీనాథ్‌తో పాటు మరో ముగ్గురు ఆడనున్నారు. ‘టీ10′ రెండో ఎడిషన్‌లో హై ప్రొఫైల్‌ కల్గిన ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా సంతోషకరం. రానున్న కాలంలో ఈ లీగ్‌లో దేశవిదేశాలకు చెందిన ఎక్కువ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని లీగ్‌ ఛైర్మన్‌ షాజీ ఉల్‌ ముల్క్‌ తెలిపారు.