24 కిస్సేస్ మూవీ రివ్యూ

0
171
టైటిల్ : 24 కిస్సేస్
తారాగణం : అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, రావు రమేష్, నరేష్, శ్రీనివాస కప్పవరపు
దర్శకత్వం : అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
రేటింగ్ : 2.5/5

కుమారి 21F హిట్ తో స్టార్ అయిపోయిన హెబ్బా పటేల్ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు.కొంత గ్యాప్ తీసుకొని ఆమె నటించించిన చిత్రం “24 కిస్సెస్”. “మిణుగురులు” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు ఆ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ వరకూ తీసుకెళ్లిన అయోధ్యకుమార్ దర్శకత్వం వహించారు. మరి 23వ తారీఖున విడుదలైన 24 కిస్సేస్ కథ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూద్దాం..!!

రివ్యూ: టీజర్ లో రొమాన్స్, ట్రైలర్ లో ముద్దులు ఉన్నాయి కాబట్టి సినిమాలో అంతకుమించింది ఏదో ఉంటుంది అనుకోని థియేటర్ కి వెళ్తే మాత్రం తీవ్రంగా నిరాశ చెందక తప్పదు. ముద్దులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలియని వారికి తెలియజేయడం తప్ప ఏ రకంగానూ ఎంటర్ టైన్ కానీ ఎంగేజ్ కానీ చేయలేకపోయిన చిత్రం “24 కిస్సెస్”.