ఘోర విషాదం.. భవనం కూలి 11 మంది మృతి

4-storey-building-collapsed-in-mumbai-9-people-died-8-people-injured-15-were-rescued

ముంబైలో రోజంతా వర్షం కురవడంతో మల్వానీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం బుధవారం రాత్రి 11.10 గంటలకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ముగ్గురు పిల్లలతో సహా 16 మందిని శిథిలాల నుండి బయటకు తీశారు. వీరిలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు బీడీబీఏ నగర్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మూడు కుటుంబాలు భవనంలో నివసిస్తున్నాయి. వీరిలో కొందరు  పిల్లలలో కూడా ఉన్నారు. 

ఈ సంఘటన తరువాత ఫైర్ బ్రిగేడ్ మరియు బిఎంసి బృందం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది. జనాభా ఎక్కువ ఉండడంతో  స్పాట్ కు చేరుకోవడానికి ఆలస్యం అయింది.  ఇరుకైన రహదారి కారణంగా అంబులెన్సులు, అగ్నిమాపక దళం మరియు జెసిబి కూడా అక్కడికి ఆలస్యంగా చేరుకున్నాయి.