తిత్లీ తుఫాను బాధితులకు రాజశేఖర్ దంపతులు విరాళం..!!

0
189
Rajsekhar Donates Titli Cyclone Victims

ఇటీవ‌ల తిత్లీ తుఫాను కార‌ణంగా శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నాయి. జ‌న జీవ‌నం పూర్తిగా అస్త‌వ్య‌స్థ‌మైంది.. ఆస్థి న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది. తిత్లీ తుఫానుతో సిక్కోలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తుఫాను బాధితుల‌ను ఆదుకోవడానికి తమవంతుగా సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా హీరో రాజశేఖర్ దంపతులు రూ.10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఇప్పటికే పలు సందర్భాల్లో సాయం చేయడానికి ముందుకొచ్చిన రాజశేఖర్‌ ఆయన సతీమణి జీవిత. మంగళవారం సాయంత్రం అమరావతిలోని సీఎం చంద్రబాబు నివాసంలో నేరుగా కలుసుకుని రూ.10 ల‌క్ష‌ల చెక్కును అందజేశారు. అనంతరం చంద్రబాబుతో కలిసి పలు విషయాలపై రాజశేఖర్, జీవిత చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. త‌మ వంతుగా సినీ ప‌రిశ్ర‌మ బాధితుల‌కు ఆప‌న్న హస్తాన్ని అందించ‌డానికి ముందుకు వ‌చ్చి తమవంతుగా సాయం చేసి పెద్ద మనసును చాటుకుంటున్నారు.