జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్న ప్రముఖ నటి జయసుధ

0
79

ప్రముఖ నటి జయసుధ వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన జయసుధ… సికింద్రాబాద్ అసెంబ్లీ సీటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నుంచీ ఆమె రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నారు. విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు జయసుధ. హైదరాబాద్ ను అభివ్రుద్ధి చేసింది చంద్రబాబేనని పొగిడారు. అయితే ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. ఇవాళ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారని సమాచారం. జయసుధకు పశ్చిమ గోదావరి జిల్లాలో టిక్కెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.