ఇక తెలుగులో బిటెక్ కోర్సులు

AICTE permits BTech programs in 11 regional languages

తెలుగు, మలయాళం, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, ఒరియా మరియు పంజాబీ తో సహా 11 ప్రాంతీయ భాషల్లో బిటెక్ కోర్సులను బోధించడానికి ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) అనుమతి ఇచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. 

ప్రాంతీయ భాషల్లో విద్యను ప్రోత్సహించడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రాంతీయ భాషల్లో బిటెక్ చదువు నిర్ణయాన్ని ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ప్రాంతీయ భాషల్లో బిటెక్ నేర్పడానికి 8 రాష్ట్రాల నుండి 14 ఇంజనీరింగ్ కళాశాలలు ముందుకు వచ్చాయని తెలిసింది.