తిత్లీ తుఫాను బాధితులకు బన్నీ రూ.25 లక్షలు సాయం..!!

0
135
Allu arjun dontes titli cyclone victims

శ్రీకాకుళంలో భీభత్సం సృష్టించిన తిత్లీ తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్‌, విజయ్‌ దేవరకొండ, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, కాజల్‌, లాంటి స్టార్‌ తమవంతు సాయాన్ని ప్రకటించారు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా బాధితుల సహాయర్థం 25 లక్షలు అందజేస్తున్నట్టుగా ప్రకటించారు.

గతంలో హుదూద్‌ తుఫాను, చెన్నై వరదలు, కేరళ వరదల సమయంలో కూడా పెద్ద మనసుతో స్పందించిన బన్నీ మరోసారి తన అదే విధంగా స్పందించారు. గతంలో, వైజాగ్ లో వచ్చిన హుద్ హుద్ విపత్తుకి 20 లక్షలు ఇవ్వటమే కాకుండా ఉత్తఖండ్ కి 10 లక్షలు ఇచ్చారు.. ఇటీవల సంభవించిన చెన్నై తుఫాను బాధితులకు అండగా నిలిచి 25 లక్షలు సహాయం చేసారు.ఈ మధ్యే కేరళ వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వటమే కాకుండా వారిలో మనోధైర్యం నింపారు. ఇక ఇప్పుడు తిత్లి తుఫాన్ శ్రీకాకులం ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే అల్లు అర్జున్ కి మొదటి నుండి ప్రత్యేకమైన అభిమానం ఉంది. వారిని ఆదుకునేందుకు అల్లు అర్జున్ 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి తన ఔదార్యం చాటుకున్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని… అభిమానులంతా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ పిలుపిచ్చారు.