సైరా నరసింహా రెడ్డి లో అల్లు అర్జున్..!!

0
183
Syeraa narasimha reddy

స్వాతంత్ర సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కీర్తి పొందారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శత్వంలో సైరా నరసింహా రెడ్డి చిత్రం తెరక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు సౌత్ లోని ప్రముఖ నటులు భాగమవుతున్నారు. విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఓ చిన్న కామియో రోల్ లో కనిపించబోతున్నట్లు వినికిడి.

అయితే తాజాగా ఓ వార్త ప్రచారం లోకి వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వాయిస్ ఓవర్ తో ప్రారంభించాల్సిన అవసరం ఉందంటూ సురేందర్ రెడ్డి చెబుతన్నారట. వాయిస్ ఓవర్ అందించడానికి ఎవరైతే బావుంటుంది అని చర్చ జరిగితే.. బన్నీ ప్రస్తావన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా బన్నీ అయితే బావుంటుందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇప్పటీకే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.