అంచనాలను అందుకోలేక పోయిన “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని”..!!

0
225
amar akbar antony review

మాస్ మహారాజా రవితేజ, బ్యూటీ ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. వరస పరాజయాలతో వెనకబడిపోయిన దర్శకుడు శ్రీను వైట్లకు ఇది రీఎంట్రీ లాంటి సినిమా. మొత్తానికి భారీ అంచనాల నడుమ నేడు(నవంబర్ 16న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్ల‌స్ పాయింట్స్‌ :
సినిమాటోగ్ర‌ఫీ
సంగీతం, నేప‌థ్య సంగీతం
వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస్ రెడ్డి కామెడీ
నిర్మాణ విలువలు.

మైన‌స్ పాయింట్స్‌ :
క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
పాటలు
ర‌వితేజ‌, శ్రీనువైట్ల సినిమాలా లేదు
ఆస‌క్తిక‌రంగా లేని స్క్రీన్‌ప్లే

విశ్లేషణ : న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. ర‌వితేజ ఫుల్ ఎన‌ర్జీతో అమ‌ర్, అక్బ‌ర్‌, ఆంటోని అనే పాత్ర‌ల‌ను చ‌క్క‌గా వేరియేష‌న్‌తో చేశాడు. ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కు త‌గిన‌ట్లు పాత్ర‌ల‌ను డిజైన్ చేశాడు. ఆరేళ్ల త‌ర్వాత తెలుగు తెర‌పై సంద‌డి చేసిన ఇలియానా సినిమాలో కాస్త బొద్దుగా క‌న‌ప‌డింది. మొదటిసారి చేసిన ఇలియానా డ‌బ్బింగ్ బాగానే చెప్పింది. అయితే డాన్సు మూమెంట్స్ లో మాత్రం కొంచెం ఇబ్బందిగా క‌ద‌ల‌డం క‌న‌ప‌డింది. విల‌న్స్‌గా న‌టించిన వారిలో త‌రుణ్ ఆరోరా, ఆదిత్య మీన‌న్‌, విక్ర‌మ్ జీత్‌, రాజ్‌వీర్ పాత్ర‌ల్లో గొప్ప విల‌నిజం అయితే క‌న‌ప‌డ‌దు. వీరి పాత్ర‌ల డిజైనింగ్‌ను శ్రీనువైట్ల స‌రిగ్గా చేసుకోలేదు. ఇక కామెడీ ట్రాక్ కోసం వెన్నెల‌కిషోర్‌, శ్రీనివాస్ రెడ్డి, ర‌ఘుబాబు తెలుగు అసోషియేష‌న్స మెంబ‌ర్స్‌గా చేసిన కామెడీ.. అప్పుల బాబీగా సునీల్ కామెడీ.. జూనియ‌ర్ పాల్‌గా స‌త్య కామెడీ ఓవ‌రాల్‌గా బాగా లేక‌పోయినా.. పార్టుల వైజ్‌గా చూస్తే కామెడీ ఓకే.

amar akbar antony

అయితే సినిమా విషయానికి వస్తే ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ చూపించలేకపోయాడు. అతనొక్క‌డే, అపరిచితుడు సినిమాలను మిక్స్ చేసి ఓ క‌థ‌ను రాసేసుకున్నాడు. దాన్ని ర‌వితేజ ఒప్పుకోవ‌డం వెనుక రీజ‌న్ తెలియ‌లేదు. ర‌వితేజ‌, శ్రీనువైట్ల సినిమా అంటే కామెడీ ఉంటుంద‌నుకుని వెళితే నిరాశ త‌ప్ప‌దు. కథ‌లో కొత్త‌ద‌నం లేదు. వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. మొత్తానికి భారీ అంచనాల నడుమ నేడు(నవంబర్ 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం, ప్రేక్షకులని అలరించలేక పోయింది. ర‌వితేజ‌, శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఒక ఫ్లాప్ చేరినట్లే అనిపిస్తుంది.

పంచ్ లైన్ : రొటీన్ రివేంజ్ డ్రామా

రేటింగ్‌: 2/5