అమర్ అక్బర్ ఆంటొని రివ్యూ

0
210
amar akbar anthony review

మాస్ మహారాజా రవితేజ, బ్యూటీ ఇలియానా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. వరస పరాజయాలతో వెనకబడిపోయిన దర్శకుడు శ్రీను వైట్లకు ఇది రీఎంట్రీ లాంటి సినిమా. టీజర్, ట్రైలర్, పాటల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ నేడు(నవంబర్ 16న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇదిలా ఉంటే, యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. సినిమా చాలా బాగుందని, ఇది శ్రీనువైట్ల పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని కొనియాడుతున్నారు. శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఫస్టాఫ్‌లో శ్రీనువైట్ల తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారట. ఇక రవితేజ కామెడీ టైమింగ్, ఎంటర్‌టైన్మెంట్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు.