ఎంఐఎంపై నిప్పులు కురిపించిన అమిత్‌షా..!!

0
219
Amith shah

తెలంగాణలో మహాకూటమి గెలిస్తే ఎంఐంఎంకు వ్యతిరేకంగా పోరాడగలదా, అని అమిత్‌షా ప్రశ్నించారు. కరీంనగర్ బీజేపీ సమరభేరిలో ఆయన.. ఎంఐఎంను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్‌ ఎక్కడ ఉందో దుర్భిణి పెట్టి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వాజ్‌పేయికి అపూర్వమైన రీతిలో బీజేపీ నివాళులర్పించిందన్నారు. అటల్‌ అంతిమ యాత్రలో మోదీ ఏకంగా ఐదు కిలోమీటర్లు నడిచారని తెలిపారు. మరి కాంగ్రెస్‌ తెలంగాణ బిడ్డ పీవీకి ఎలాంటి గౌరవమిచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ కాంగ్రెస్‌ అని అమిత్‌షా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తో, రాహుల్‌ కంపెనీతో సాధ్యంకాదని వెల్లడించారు. దేశాన్ని పునర్నిర్మించడం కోసం మోదీ పనిచేస్తున్నారని అమిత్‌షా తెలిపారు.