రైతు బంధు పథకం పై విశ్లేషణ

0
433

మన దేశంలో ముఖ్యంగా ఉన్న సమస్య రైతు ఆత్మహత్యలు వీటిని నివారించే దిశగా రాష్ట్ర మరియు దేశ ప్రభుత్వాలు చాలా రకాల పథకాలను తీసుకువస్తున్నా రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగటం లేదు.ఈ రోజు ఏదైతే ఆహార భద్రత అని పదే పదే చెప్తున్న దేశీయ రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కేవలం వెబ్ సైట్ లకు మాత్రమే పరిమితమయ్యాయి.కానీ పంట పండించే రైతుకే భద్రత కరువైంది.ఇలాంటి సమయంలో పుట్టుకొచ్చిన పథకమే మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేపట్టిన బృహత్తరకార్యక్రమం రైతు బంధు పథకం.

[penci_related_posts taxonomies=”undefined” title=”Related Posts” background=”” border=”” thumbright=”no” number=”4″ style=”list” align=”none” displayby=”cat” orderby=”random”]
ఈ పథకం ప్రకారం సంవత్సరానికి రెండు పంటలకు గాను అక్షరాల ఎనిమిది వేల రూపాయలు అందిస్తున్నందున మన రాష్ట్ర ప్రభుత్వం.ఈ పథకం వలన బాగుపడుతున్న కుటుంబాలెన్నో ఉన్నాయి . కానీ ఏఏ రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్లలో సొంతంగా భూమి ఉన్న వాళ్ళు పది శాతం కన్నా తక్కువే.ఈ రైతులనే మన వాడుక భాషలో కౌలు రైతులు అంటున్నాం.పంట కోసం విత్తనాల కోసం తెచ్చుకున్న అప్పులు,పొలం దున్నెందుకు చేసిన అప్పులు ,పంట చేతికి వచ్చాక సరైన గిట్టుబాటు ధర లేక భూస్వామి కి కౌలు డబ్బులు ఇవ్వలేక ఆ భగవంతుడికి తమ ప్రాణాల ని ఇచ్చేస్తున్నారు మన రైతులు.నేడు న్యాయం జరగాల్సింది ఎవరికి,భూమి ఉన్న రైతులు అప్పు కట్టలేక ప్రాణం మీదికి వస్తే భూమి అమ్మి అప్పు తీర్చే అవకాశం ఉంది,కానీ కౌలు రైతులకు ఆ అవకాశం లేదు,ఈ పథకం లో కౌలు రైతులను ఎందుకు చేర్చలేదని అడిగిన ప్రతిపక్షాలకు అధికార పార్టీ ఇచ్చిన సమాధానం “కౌలు రైతులను గుర్తించటం కష్టమైన పని “సకలజనుల సర్వే అని దేశ నలుమూలలనుండి ప్రజలందరినీ సొంతూళ్లకి రప్పించగలిగి గిన్నిస్ బుక్ కి ఎక్కిన ఘనత కలిగిన మన రాష్ట్ర ప్రభుత్వానికి కౌలు రైతు లను గుర్తించటం అంత కష్టమైన పనేమీ కాదనేది అందరికి తెలిసిన సత్యం.కౌలు రైతులు అందరూ ఎక్కడో ఉండరు,అంతా గ్రామాల్లోనే ఉంటారు.ఒక నెల రోజుల సమయం లో వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా ఆదుకుని ఉంటే చాలా బాగుండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here