వైఎస్ తోపాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సుబ్రవ్మాణ్యం కుమార్తెకు కీలక పోస్టు

andhra-pradesh-government-appoints-sindhu-subrahmanyam as RDO

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌,.రాజశేఖర్‌రెడ్డితో పాటు 2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి పీ. సుబ్రవ్మాణ్యం కుమార్తె పి.సింధు సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్టీవోగా నియమించింది. ఈ మేరకు సీఎస్ నుంచి ఆదేశాలు అందాయి.. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.  ఎం.ఎస్‌.సింధు నుబ్రవ్మాణ్యంను కృష్ణాజిల్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ (పిడిసి)గా నియమిస్తూ 2020, మే 29లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే..

అయితే ఆమె 72 వారాల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తిచేసుకోవడంతో ఆమెను ఆర్డీఓగా ప్రభుత్వం నియమించింది. కాగా హెలికాఫ్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ పి.నుబ్రవ్మాణ్యం, ఐపీఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎఎస్‌.సీ,వెస్లీ, హెలికాప్టర్‌ పైలెట్లు కెప్టెన్‌ ఎస్‌.కెభాటియా, కో సైలెట్‌ ఎం.ఎస్‌.రెడ్డి నాటి ప్రమాదంలో మరణించిన విషయం విదితమే.