సీఎం జగన్ తో అనిల్‌ కుంబ్లే భేటీ.. అందుకేనా?

Anil Kumble meets CM Jagan

గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డిని  ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌  కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి చేరుకున్న కుంబ్లే.. అనంతరం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కుంబ్లేని శాలువాతో సీఎం సత్కరించి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక ఇద్దరి మధ్య గంటపాటు చర్చలు జరిగాయి. ఏపీలో క్రికెట్ క్రీడను బలోపేతం చేసేందుకే అనిల్ కుంబ్లేని సీఎం పిలిపించినట్టు తెలుస్తోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెల్లడికాలేదు.