తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి!

Anushka-is-going-to-marry-younger-than-her

టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. అంతేకాదు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది అనుష్కనే.. ఆమెకు 40 ఏళ్ళు వస్తున్నా  ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు.. అను.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. టాలీవుడ్ లో ప్రభాస్-అనుష్కది సూపర్ హిట్ కాంబినేషన్, వారిమధ్య మంచి స్నేహం కూడా ఉంది. దాంతో వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు.. కానీ ఇది జరగలేదు.. తమ మధ్య స్నేహం తప్ప ఏ విధమైన రిలేషన్ లేదని తేల్చి చెప్పారు.. దాంతో ప్రభాస్-అనుష్క ల మధ్య లవ్ లేదని స్పష్టమైంది.

ఈ క్రమంలో అనుష్క పెళ్ళికి సంబంధించి మరోసారి చర్చ జరుగుతోంది.. త్వరలోనే స్వీటీ పెళ్లికూతురు కాబోతుందని ఫిలిం నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అనుష్క తల్లిదండ్రులు కూడా కూతురికి తగ్గ వరుడిని చూసినట్టు వార్తలు వస్తున్నాయి.. ఆ అబ్బాయి దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. అయితే అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పెళ్లి విషయంపై ఇరువురు కుటుంబసభ్యులు చర్చించుకున్నారని.. ఈ ఏడాది చివరినాటికి వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. మరి అనుష్క పెళ్లి వార్త ఏపాటిదో చూడాలంటె కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.