ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్

ap-cm-ys-jagan-visit-delhi-today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటి కిందటే ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట ఎంపీలు బాలసౌరి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌ షా, జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్‌ భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు.. తిరిగి రేపు  మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.