మందస మండలాన్ని దత్తత తీసుకుంటున్న నారా లోకేష్

0
225
nara lokesh will adopt mandasa mandal
తిత్లి తుపానుతో నష్టపోయిన ప్రజలకు రూ. 530 కోట్ల పరిహారం ఇస్తున్నామని మంత్రి లోకేష్ ప్రకటించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ తుఫాను వచ్చిన 12 గంటల్లో సీఎం చంద్రబాబు ప్రజల ముందు ఉన్నారని, సిక్కోలు ప్రజలు కోలుకునే వరకు ఇక్కడే ఉన్నారన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ రాష్ట్రంలో పర్యటించారని, గుంటూరులో పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారని లోకేష్‌ విమర్శించారు. కనీసం తిత్లి తుపాన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదని అన్నారు. అలాగే జగన్‌ పక్క జిల్లాలోనే (విజయనగరం) ఉండి తుపాను బాధితులను పరామర్శించలేదని మంత్రి విమర్శించారు. మందస మండలాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని లోకేష్‌ అన్నారు.