ఏపీ సమాచార కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి నియామకం

ap-rti-commissioners

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్‌ లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్‌కి సిఫారసు చేసింది. ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం కోసం ఇవాళ ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో  సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా హోం మంత్రి మేకతోటి సుచరిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్లుగా హరిప్రసాద్‌, చెన్నారెడ్డిని కమిటీ ఎంపిక చేసింది. కాగా  హరిప్రసాద్‌ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. గత 20 ఏళ్లుగా జర్నలిస్టుగా కోనసాగుతున్నారు. ఇక  లా గ్రాడ్యుయేట్‌ అయిన కాకర్ల చెన్నారెడ్డి హైకోర్టుల్లో  పలు కీలక కేసులు వాదించారు.. గత 15 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు.