సినీనటి కవిత ఇంట పెను విషాదం

artist-kavitha-son-lost-life-due-to-corona

సినీ నటి, బీజేపీ నాయకురాలు కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ మరణించారు. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో నటి కవిత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరో వైపు కవిత భర్తకు కూడా కరోనా సోకింది. ఆయన కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు స‌మాచారం. 

కాగా క‌విత 11 ఏళ్ల వ‌య‌సులోనే తెరంగేట్రం చేశారు. టాలీవుడ్‌లో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి సిరి సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 1990లో ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా క‌విత గుర్తింపు పొందారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.