వైసిపికే తన మద్దతు , జగన్ వెనుకే తన ప్రయాణం అంటున్న కేవిపి బంధువు అశోక్ బాబు

Ashok Babu says his support for the YCP and his journey with Jagan

చింతలపూడి నుండి ఏలూరు చుట్టుపక్కల  గ్రామాల్లో అశోక్ బాబు కి ఉన్న మంచి పేరు అంతా ఇంతా కాదు. ఆ గ్రామాల్లో ప్రజలకి ఏ సమస్య వచ్చినా వాళ్లకి గుర్తొచ్చే పెరు అశోక్ బాబు.. ప్రతి ఒక్కరి సమస్యని తన సమస్యగా అనుకోని ముందుకు వెళ్లే స్వభావం కలిగిన ప్రజనాయకుడు అశోక్ బాబు..చింతలపూడి నియోజకవర్గంలో వైసిపి జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వైయస్ జగన్ వెంట నడిచిన వ్యక్తి అశోక్ బాబు. 2014లో పార్టీ ఓడిపోయినప్పుడు కూడా నిరంతరం వైఎస్సార్సీపీకి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో అశోక్ వెన్నుదన్నుగా నిలిచారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడంలో ఈయన పాత్ర అత్యంత కీలకం. 

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు  ఏఎంసీ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత పూర్తిగా జగన్ పాలన కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. 2019 సాధారణ ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో  మరియు కోటగిరి విద్యాధరరావు తనయుడు శ్రీధర్ బాబు గెలుపులో మరియు వైసీపీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు అశోక్. అంతే కాదు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో దశాబ్దాలుగా ఒకే వర్గం చేతుల్లో ఉన్న అధికారం సైతం వైసిపికి వచ్చేలా చేయడంలో అశోక్ పాత్ర మరువలేనిది. ఒంటి చేత్తో అక్కడ పంచాయతీలు వైసీపీ ఖాతాలో పడేలా చేశారు ఈయన. 

2019 సాధారణ ఎన్నికల తర్వాత చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్ పి కోటగిరి శ్రీధర బాబు నాయకత్వం లో  వైసీపీ ని మరింత బలోపేతం కావడంలో అశోక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు. అరగంటకు పైగా ఆయనతో చర్చించారు. చింతలపూడి నియోజకవర్గంతో పాటు కామవరపుకోట మండల వైసీపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అశోక్. ఈయన ముఖ్యమంత్రితో బేటీ అవ్వటం పశ్చిమగోదావరి జిల్లా అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది