పాట్‌ కమిన్స్‌ ఔదార్యం.. PM కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం

Australian pacer Pat Cummins donates $50,000 to PM Cares Fund

కోవిడ్ -19 తో భారతదేశం చేస్తున్న పోరాటంలో సహాయపడటానికి ఆస్ట్రేలియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ ముందుకు వచ్చారు.. PM కేర్స్ ఫండ్‌కు 50,000 డాలర్ల విరాళం ఇచ్చారు. అంతేకాదు మిగతా ఐపీఎల్‌ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో  ఆక్సిజన్‌ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్‌  ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 ఈ మొత్తాన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేయడానికి అలాగే దేశానికి సహాయం చేయడానికి ఉపయోగించాలని.. అందుకే ఈ నిధికి సహకారం అందించానని కమ్మిన్స్ చెప్పారు. భారత్ ను తాను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని..  ఇక్కడి ప్రజలు దయగలవారని అన్నారు. అటువంటి ప్రజలు ఇప్పుడు  బాధపడుతున్నారని తెలుసుకోవడం నన్ను చాలా బాధపెడుతుందని అందుకే ఈ సహాయం చేశానని కమ్మిన్స్ అన్నారు.