ఓ ఇంటివాడు అయిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జాంపా

australian-spinner-adam-zampa-married-his-longtime-girlfriend-secretly

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జాంపా ఓ ఇంటివాడు అయ్యాడు.. తన చిరకాల స్నేహితురాలు హట్టి పామర్‌ ను క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహ వేడుక గత వారమే జరిగినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, హట్టి పామర్ కోసం దుస్తులను డిజైన్ చేసిన సంస్థ, పెళ్లి దుస్తులతో ఉన్న కొత్త దంపతుల చిత్రాలను పంచుకున్న తర్వాత ఈ విషయం తెలిసింది.

ఆ తరువాత వీరిద్దరూ కూడా అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ వివాహం ఆడమ్ జాంపా, మరొక క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ గురించి జోకులు వేయడాన్ని తగ్గించింది..  ఎందుకంటే వీరిద్దరూ ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటారని.. వారు స్వలింగ సంపర్కులు అని రూమర్లు వచ్చాయి. అయితే హట్టి పామర్‌తో ఆడమ్ జాంపా వివాహం నేపథ్యంలో పుకార్లకు తెరపడినట్లయింది.