రామ మందిరానికి విరాళం ఇచ్చిన చెక్కులు బౌన్స్.. వాటి విలువెంతో తెలుసా!

రామ మందిరానికి విరాళం ఇచ్చిన చెక్కులు బౌన్స్.. వాటి విలువెంతో తెలుసా!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిత‌మ‌వుతున్నది‌ అయోధ్య రామ మందిరం. ఈ మందిర నిర్మాణంలో హిందువులంద‌రినీ భాగ‌స్వామ్యం చేయడానికి విశ్వ‌హిందూ పరిష‌త్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున విరాళాలు సేక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే విరాళాలలో క్యాస్ తో పాటు చెక్ కూడా ఇచ్చారు చాలా మంది. అయితే ఈ స‌మ‌యంలో భ‌క్తులు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 15వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి.  విరాళంగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావ‌డమేమిటీ.. ఇష్టం లేక ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావ‌డం చూశాం కానీ, భ‌క్తితో ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావ‌ట‌మేమిట‌ని విస్మ‌యానికి గుర‌వుతున్నారు.  

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేసిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. దాదాపు 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని తేలింది. ఆ చెక్కుల విలువ రూ.22 కోట్ల వరకు ఉంటుంది. బ్యాంకులలో నిధులు లేకపోవడం వల్లగానీ, లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లగానీ చెక్కులు బౌన్స్ అయి ఉండొచ్చని ఆడిట్ నివేదికలో ట్రస్ట్ పేర్కొంది. వివిధ కార‌ణాల వ‌ల్ల చెక్కులు బౌన్స్ అయ్యాయ‌ని భావిస్తే… వారు మళ్లీ విరాళాలు సమర్పించాలని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా కోరారు.