బ్రేకింగ్: బాల సాయిబాబా కన్నుమూత

0
393
bala sai baba passed away
ప్రపంచవ్యాప్తంగా ఏంతో మంది భక్తులను సంపాదించుకున్న యాబై ఎనిమిదేళ్ల బాల సాయి బాబా ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి హైదరాబాద్ ఆశ్రమంలో ఉన్న బాల సాయి బాబాకు హఠాత్తుగా గుండె నొప్పి రావడం తో ఆయనను ఆసుపత్రికి తరలించారు.దాదాపు 10 గంటలు మృతువుతో పోరాడిన అయన చివరకు శివాక్యం అయ్యారు.
బాల సాయి బాబా 1960 వ సంవత్సరం జనవరి 14న కర్నూల్ లో జన్మించారు.ఆయన పూటక గురించి అంతక మునుపే రమణ మహార్చి చెప్పి ఉన్నారు. అయన తానా 18వ ఏట నుండే తన మహిమలు చూపియడం ప్రారంభించారు. నోటిలో నుంచి శివలింగం తీయడం,గాలిలో నుండి ఉంగరాలు,హారాలు,విబూది,చేతి పూచి తీయడం లో సిద్దహస్తులు. ప్రపంచవ్యాప్తంగా ఏంతో మంది భక్తులను పొందారు. బాల సాయి బాబా ఆశ్రమం ఒకటి హైదరాబాద్ లో మరొకటి కర్నూల్ లో ఉండి, బాల సాయి బాబా సేవ సమితి అధ్వర్యంలో లో అనేక సేవ కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ వచ్చారు.అయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 14న అనేక మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు. అయన అకాల మృతి పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు.అమెరికా,జపాన్ లో ఈయనకు భక్తులు అధికం.అయన పార్థివ దేహాన్ని ఎక్కడికి తరలించాలి అనేదాని పై ఇంకా స్పష్టత రాలేదు.ఎప్పుడు సేవా,ప్రేమను పంచే మా దేవుడు లేదు నే చేదు వార్తలను భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.