పోలీస్ ఆఫీసర్‌గా రానున్న బెల్లంకొండ శ్రీనివాస్..!!

0
208
Kavacham Movie First Look

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది బెల్లం కోసం శ్రీనివాస్ సాక్ష్యం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కెరీర్ లో తొలి హిట్ కోసం బెల్లంకొండ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. తేజ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తుండగా, కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీనివాస్ మామిళ్ళ దర్శత్వంలో నటిస్తున్న “కవచం” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.