* భీష్మ * మూవీ రివ్యూ

* భీష్మ * మూవీ రివ్యూ

 

నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్ తదితరులు
సంగీతం: మహతి సాగర్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
దర్శకుడు: వెంకీ కుడుముల
బ్యానర్: సితార ఎంటర్‌టైన్మెంట్స్
కెమెరా: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: నవీన్ నూలి

కథ ఒక్క ముక్కలో
సోలో బ్రతుకు తో విసిగిపోయిన భీష్మ‌ (నితిన్) మొదటి చూపులోనే చైత్ర ( రష్మిక) ప్రేమ లో పడతాడు. చైత్ర భీష్మ‌ ఆర్గానిక్ కంపెనీలో వర్క్ చేస్తుంది. ప్రేమ కోసం ఆ  కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు.. తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు.

విషయం ఏంటంటే ..

సినిమా ఏంటి ఎలా ఉండబోతోంది అనేది దర్శకుడు ట్రైల‌ర్ లోనే కథ చెప్పేసాడు. ఆ ట్రైలర్ లో ఏముందో  సినిమాలో కూడా అదే ఉంది అంతకంటే కొత్తగా ఏం లేదు. ఆర్గానిక్ వ్యవసాయం అనే పాయింట్ తీసుకున్నప్ప‌టికీ, ఈమధ్య చాలా సినిమాలు వ్యవసాయం, రైతుల మీద వచ్చాయని ఫీల్ అయ్యారో ఏమో దాన్ని సెకెండ్ ఫ్లాట్ గా మార్చేశారు. లవ్ కామెడి మీదే దృష్టి పెట్టారు. ఆ కామెడి కూడా సాగదీసినట్టు అనిపిస్తుంది. కామెడి డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అలా అలా కామెడీ గా సాగిన ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ రొటీన్ గానే ఉంటూ ఆడియన్స్ ఉహించినట్టే క్లైమాక్స్ ఉండడం వల్ల నిరుత్సాహం తప్పదు. నితిన్ విషయానికి వస్తే అ ఆ సినిమా తర్వాత వరస  పరాజయాల తో ఉన్న నితిన్ కి వాటితో పోలిస్తే ఇది కాస్త బెటర్ అని చెప్పొచ్చు. నితిన్ అంతా తానై నడిపించాడు. కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. స్టైలిష్ గా ఆకట్టుకున్నాడు.
 
రష్మిక  గ్లామర్ గా ఉంది.. ఓవర్ యాక్షన్ చేసినప్పటికీ పర్వలేదనిపిస్తుంది. కన్నడ నటుడు అనంత నాగ్  బాగా చేశారు. వెన్నెల కిషోర్, రఘుబాబు కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు విలన్ జిస్సు సేన్ ని సరిగ్గా వాడలేదు అనిపిస్తుంది. 

దర్శకుడు వెంకీ ఛ‌లో సినిమాతో మంచి కామెడీ తో విజయాన్ని అందుకున్నాడు. సహజంగా రెండో సినిమాకి ద్వితీయ విఘ్నం తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, స‌రైన కథ‌ అందుకోలేదు, సరైన స్క్రీన్ ప్లే అల్లుకోలేదు, డైలాగులు వరకు మాత్రమే న్యాయం చేసాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడి గా చేసి, తర్వాత సాగదీసి అనుకున్న క్లైమాక్స్‌ తో ముగించాడు.

మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మహతి ఛ‌లో సినిమాలో సంగీతం లో ఎంత ఎఫర్ట్ పెట్టాడో, భీష్మ‌ కి కూడా అంతకు మించి ప్లస్ అయ్యాడు.

కెమెరా సాయి శ్రీరామ్  రిచ్ గా అందంగా తీసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవర్ అల్ గా
భీష్మ‌ ఓన్లీ నితిన్ షో నే.

చివరగా..
భీష్మ... ఆర్గానిక్ విత్తనాలు సగమే పండాయ్, మిగతావి ఎండాయ్.