ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్‌ నటికి తీవ్ర గాయాలు

bigg-boss-tamil-fame-yashika-anand-terrible-car-accident-tamil-nadu

ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ యాషిక ఆనంద్ మామల్లపురం సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె తోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాము మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న యషిక ఆనంద్ కూడా మోడలింగ్ రంగంలో కూడా ఉన్నారు.