27 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి చెప్పిన బిల్ గేట్స్ దంపతులు

Bill And Melinda Gates End 27-Year Marriage "After Great Deal Of Thought"

27 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు బిల్ మరియు మెలిండా గేట్స్ సోమవారం చెప్పారు. ఈ విషయాన్నీ వారిద్దరు తమ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం.. అందుకే తమ వివాహాన్ని ముగించే నిర్ణయం తీసుకున్నామని ఇద్దరూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం అన్నారు..

అలాగే ప్రపంచవ్యాప్తంగా పనిచేసే ఒక పునాదిని నిర్మించామని అన్నారు. బిల్ గేట్స్ ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు. 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు వినియోగించారు. మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్‌ సీఈవోగా ఉన్న సమయంలో మెలిందా ప్రొడక్ట్‌ మేనేజరుగా చేరారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. వారిద్దరు 1994లో వివాహం చేసుకున్నారు.