స్టెరాయిడ్స్ లేకపోయినా బ్లాక్ ఫంగస్ వస్తుందా?

Black Fungus Even Without Steroids Is On Rise

బ్లాక్ ఫంగస్ అనేది కోవిడ్ అనంతర రోగులలో విస్తృతంగా వ్యాపించే భయంకరమైన వ్యాధి. ఈ రోజుల్లో, ఈ ఫంగస్ అధిక మోతాదులో స్టెరాయిడ్లు మరియు యాంటీబయాటిక్స్ వాడిన రోగులపై ఒకేసారి దాడి చేస్తుందని నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. అటువంటి చికిత్సలు చేసే డయాబెటిక్ రోగులలో ఇది ఎక్కువగా ఉందని కూడా తేల్చారు. కానీ, ఆశ్చర్యకరంగా ఇది హోమ్ ఐసోలేషన్ లో స్టెరాయిడ్ చికిత్స లేకుండా వ్యాధి నుండి బయటపడిన పోస్ట్ కోవిడ్ రోగులలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఈ విషయంపై డాక్టర్ సమీర్ షా మాట్లాడుతూ.. పోస్ట్ కోవిడ్ రోగులలో మ్యూకోమైకోసిస్ పెరుగుతున్నట్లు వెల్లడించారు. 

ఇటీవలే ఇద్దరు 25-30 వయస్సు గల రోగులు హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందారు.. వారికి స్టెరాయిడ్ లేదా ఆక్సిజన్ తీసుకున్న చరిత్ర లేదా అలాగే మధుమేహం లేనివారు కూడా అకస్మాత్తుగా ఈ భయంకరమైన వ్యాధి బారిన పడ్డారు.. ఇది ఎలా, ఎక్కడ నుండి వచ్చిందో అర్ధం కాలేదని అన్నారు. కరోనా బారి నుండి తప్పించుకోవడానికి మాస్కు ధరిస్తుంటారు.. అది N95 లేదా కాటన్ మాస్క్ కావచ్చు, అయితే దీనిని చాలాసార్లు ఉపయోగిస్తుంటారు. ఒకసారి దానిని ధరిస్తే, శ్వాసలోని తేమ కారణంగా, అది తడిసిపోతుంది, అది మనకు అనిపించదు. కొందరు మాస్కులను 3-5 రోజులు ఉపయోగిస్తుంటారు.. ఇది ఫంగస్ పెరుగుదలకు సరైన వాతావరణం కల్పిస్తుందని అన్నారు. కాబట్టి మాస్కును వేడినీటిలో కడిగి ఎండలో ఆరబెట్టాలి సలహా ఇచ్చారు.