కోవిడ్ తో పోరాడటానికి మీ రోగనిరోధక శక్తిని ఈ విధంగా పెంచుకోండి

build-your-immunity-to-fight-covid-lemon-juice-in-warm-water

ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నిమ్మకాయ నీరు త్రాగటం వలన  శరీరం పునరుజ్జీవింపచేయడానికి అలాగే హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందట.. నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది,  అందువల్ల యాంటీఆక్సిడెంట్ తోపాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందట.

ఈ సాధారణ రోగనిరోధక శక్తి బూస్టర్ గురించి ఫోర్టిస్ హాస్పిటల్ హెడ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నమితా నాదర్‌ విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇది శరీరంలో వ్యాధికారకాలతో పోరాడటానికి సమర్థవంతంగా సహాయపడుతుందని ఆమె అన్నారు. 

కావలసినవి
1 గ్లాసు గోరువెచ్చని నీరు

1-2 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం

1/4 టేబుల్ స్పూన్ సముద్రపు ఉప్పు

1/4 టేబుల్ స్పూన్ తేనె  

ఎలా చేయాలి?
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకొని అందులో 1-2 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం,1/4 టేబుల్ స్పూన్ సముద్రపు ఉప్పు కలపండి. ఈ పానీయంలో కొంచెం ఫైబర్ జోడించడానికి చియా విత్తనాలను వాడాలి. దాంతో ఇది తయారవుతుంది.

తాగినప్పుడు
వేడి నీటిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పుతో పాటు రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, విటమిన్ 'సి' ని అందిస్తుంది. పగటిపూట ఎప్పుడైనా గ్రీన్ టీతో కూడా దీనిని ఉపయోగించవచ్చు. 

రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే నిమ్మరసం లక్షణం అని డాక్టర్ నమితా నాదర్ చెప్పారు. ఇది  శరీరం కోల్డ్ మరియు ఫ్లూ వైరస్కు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుందని ఆమె అన్నారు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.. కాబట్టి ఈ రెండూ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. దీని వలను గుండె జబ్బులను తగ్గించవచ్చు, మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు, ఐరన్ సముపాళ్ళలో అందుతుంది.