వైసీపీలో చేరిన సి.రామచంద్రయ్య

0
175
c ramachandraiah joins in ycp
మంగళవారం విజయనగరం జిల్లా మక్కువ మండలం కొయ్యానపేట నుంచి ఉదయం 9.30కి ఆయన తన పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవునా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. విద్యార్థులు, మహిళలతో సెల్ఫీలు దిగారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కంచేడువలస జంక్షన్‌, వెంకటభైరిపురం గ్రామాలమీదుగా నడిచారు.దారి పొడవునా వేచి ఉన్న విద్యార్థులు, మహిళలను ఆప్యాయతగా పలకరిస్తూ ముందుకు సాగారు. గెడ్డలుప్పి వద్ద సువర్ణముఖిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులు పరిశీలించారు. కాగా.. పాదయాత్రకు సుమారు 150 మంది పోలీసు సిబ్బంది, మూడు రోప్‌ పార్టీలు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, డ్రోన్‌ కెమెరాలు, బాడీ కెమెరాలతో పటిష్ఠ భద్రత కల్పించారు.
వైసీపీలోకి రామచంద్రయ్య
కడప జిల్లా నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య జగన్‌ సమక్షంలో మంగళవారం వైసీపీలో చేరారు. బగ్గందొరవలస వద్ద తన అనుచరులతో జగన్‌ను కలిశారు.