ప్రాజెక్తులను బోర్డుల పరిధిలోకి తేవడం వలన నష్టమే : మైసురారెడ్డి

Centre’s notification on KRMB, GRMB a big blow to R'seema projects: MV Mysura Reddy

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎమ్‌బి), గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జిఆర్‌ఎమ్‌బి) అధికార పరిధిని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం చేసిందని మాజీ ఎంపి ఎంవి మైసురారెడ్డి బుధవారం అన్నారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ నీటిపై రాజకీయ మైలేజీ కోసం పోయి తెలుగు రాష్ట్రాలను వివాదంలోకి నెట్టారని అన్నారు.. ఫలితంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నీటి ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుందని ఆయన విమర్శించారు. సిఎంలు ఇద్దరూ చర్చించి నది నీటి సమస్యలను పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.