నేడు బెంగళూరుకు వెలనున్న చంద్రబాబు..!

0
171
Chandrababu Naidu Meets With Deve gowda

ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపాయేతర శక్తులను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ బెంగుళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో ఈ మేరకు కీలక భేటి నిర్వహించనున్నారు. భాజపా వ్యతిరేక పక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేలా కార్యచరణను సిద్దంచేసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మధాహ్నం మూడు గంటలకు బెంగూళురు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు దిల్లీ పర్యటనల నేపథ్యంలో బిజేపియేతర శక్తులన్నీ సంఘటితం అవుతుండంతో నేటి తెదేపా, జెడీఎస్ నేతల భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సార్లు హ‌స్తిన‌ పర్యటనలో భాగంగా చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాయావతి, శ‌ర‌ద్‌ప‌వార్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌,ములాయం, అఖిలేష్‌, ఫ‌రూఖ్ అబ్దుల్లా, వామ‌ప‌క్ష పార్టీల అగ్రనేత‌లతో వరుస భేటీలు నిర్వహించి అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భాజపాయేతర శ‌క్తుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చే ప్రయ‌త్నాల్లో భాగంగా ఇంకా ఎవ‌రెవ‌ర‌ని క‌ల‌వాలి అనేదానిపైన చంద్రబాబు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.