చికెన్ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..

chicken-prices-hugely-reduced-in-telangana

ముక్కలేనిది ముద్ద దిగని చికెన్ ప్రియులకు సంతోషకర వార్త వెలువడింది. తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు మరోసారి భారీగా పడిపోయాయి.. ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చికెన్‌ ధరలు  తగ్గుతున్నాయి. గతనెలలో రూ.270 దాకా పలికిన కిలో చికెన్‌ ధర.. ఈనెలలో రూ.150కు పడిపోయింది. నెలరోజుల వ్యవధిలోనే రూ.120 తగ్గింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం లైవ్‌కోడి ధర రూ.100 పలుకుతోంది.

రాష్ట్రంలో రోజుకి సగటున 9 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి.  ప్రస్తుతం రోజుకు 6 లక్షల కిలోలకు మించి అమ్ముడు పోవడం లేదు. నైట్ కర్ఫ్యూతో అమ్మకాలు పెద్దఎత్తున తగ్గిపోయంటున్నారు చికెన్ వ్యాపారులు. కరోనా సెకండ్ వేవ్ తో ఫంక్షన్లు, పెళ్లిళ్లు సభలు, సమావేశాలు లేకపోవడం కూడా ధరలు తగ్గడానికి కారణం అయింది.