ప్రపంచం నెత్తిన చైనా బాంబ్.. కంట్రోల్ తప్పిన రాకెట్

A Chinese rocket that might be out of control is hurtling back to Earth

ఇప్పటికే చైనా నుంచి వచ్చిన కరోనావైరస్ తో పోరాడుతుంటే..  ప్రపంచం నెత్తిన మరో బాంబ్ ప్రయోగించింది చైనా.. ఈ నెల ఐదున ప్రయోగించిన చైనీస్ రాకెట్ భూమిపైకి తిరిగి వస్తోందని.. అది నియంత్రణ కోల్పోయిందని.. శనివారం ఎప్పుడైనా క్రాష్ అవుతుందని యూఎస్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ రాకెట్ జనావాస ప్రాంతాన్ని తాకే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది ఖచ్చితంగా ఎక్కడ పడుతుందో చెప్పలేమని పెంటగాన్ ఈ వారం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధికారులు రాకెట్ స్థితిని ట్రాక్ చేస్తున్నారు. అలాగే భూమిపై పడే ఈ రాకెట్ శిధిలాలను కూడా  అమెరికా స్పేస్ కమాండ్ ట్రాక్ చేస్తుందని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.