"చిన్నారి పెళ్లి కూతురు" బామ్మ ఇకలేరు

chinnari-pelli-kuthuru-fame-surekha-sikri-expired-due-to-heart-attack

ప్రముఖ నటి సురేఖా సిక్రీ కార్డియాక్ అరెస్ట్ కారణంగా 75 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. 50 ఏళ్లుగా నటనా ప్రపంచంలో చురుకుగా ఉన్న సురేఖాకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ఎక్కువ గుర్తింపు లభించింది. కఠినమైన అమ్మమ్మ పాత్రతో ఆమె ప్రతి ఇంటింటి సుపరిచితం అయింది. ఎన్‌ఎస్‌డి గ్రాడ్యుయేట్ అయిన సురేఖా సిక్రీ మూడుసార్లు జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

1945 ఏప్రిల్ 15 న న్యూఢిల్లీలో జన్మించిన సురేఖ సిక్రీ తన కెరీర్లో వివిధ రకాల పాత్రలను పోషించి నటిగా మంచి గుర్తింపు పొందింది. సుమారుగా 20 కి పైగా చిత్రాల్లో నటించిన సురేఖ సిక్రీ 10 కి పైగా సీరియల్స్ కూడా నటించింది.