వ్యాక్సిన్‌పై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

cm-ys-jagan-decide-write-letter-pm-narendra-modi-vaccination

ఏపీలో 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయించింది.  ఇందులో భాగంగా వ్యాక్సిన్ కొరత తీర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు  తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది.

ఆక్సిజన్ కోసం ఇతర దేశాలని సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.. ఇదిలావుంటే రేపటి నుంచి కర్ఫ్యూను కచ్చితంగా పాటించేలా కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు నడపకూడదని నిర్ణయించారు. అలాగే ఉదయం 11.30 గంటల వరకే కళాశాలల నిర్వహణకు అవకాశం ఇచ్చారు.