కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ

cm-ys-jagan-meets-union-minister-javadekar

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు.  గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తోపాటు జలశక్తి మంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని మంత్రి షెకావత్‌ కు వివరించారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన జగన్ పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. కాగా షెకావత్‌తో సీఎం జగన్‌ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. కాగా ఇవాళ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ అవుతారు.