కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి అగ్రనేత.. అమిత్ షాతో భేటీ!

congress-senior-leader-jitin-prasad-may-join-bjp

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ 'సర్జికల్ స్ట్రైక్' ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్ర నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు జితిన్ ప్రసాద్ బిజెపిలో చేరారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నివాసానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు. ఈ భేటీ అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా,పియూష్ గోయల్ సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. 

కాగా కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వ్యవహారశైలిపట్ల  జితిన్ ప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే సడన్ గా అయన బీజేపీలో చేరడం కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లో ఆయనకంటూ బలమైన క్యాడర్ ఉంది. అటువంటి నేత అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరం ముందు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.