బీహార్ లో లాక్ డౌన్ విధింపు

corona-lockdown-in-bihar-till-15

బీహార్ కూడా కరోనా సంక్రమణ గొలుసును విచ్చిన్నం చేయడానికి లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. దీంతో హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ తరువాత లాక్డౌన్ చేసిన ఆరో రాష్ట్రంగా బీహార్ అవతరించింది. మంగళవారం ఉదయం బీహార్ సిఎం నితీష్ కుమార్.. మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మే 15 వరకూ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు.

బీహార్‌లో కొద్దిరోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆసుపత్రులలో పడకల కొరత, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో హైకోర్టు జోక్యం చేసుకుంది.. మే 4 లోపు లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకాయించాలని.. లేదంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు నితీష్ ప్రభుత్వం ప్రకటన చేసింది.